ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కృష్ణమ్మ శుద్ధిలో స్వచ్ఛ గుడివాడ' - kodali nai

కృష్ణా జిల్లా గుడివాడలో 'కృష్ణమ్మ శుద్ధిలో స్వచ్ఛ గుడివాడ' పేరుతో కార్యక్రమం నిర్వహించారు. కృష్ణమ్మ శుద్ధిలో నేను సైతం అనే నినాదంతో పని చేశారు. ఎమ్మెల్యే నాని, కలెక్టర్​, పట్టణంలోని పలువురు ప్రముఖులు పాల్గొని మురుగును శుభ్రం చేశారు.

'కృష్ణమ్మ శుద్ధిలో స్వచ్ఛ గుడివాడ'

By

Published : Jun 1, 2019, 9:31 AM IST

కృష్ణమ్మ శుద్ధిలో 'నేను సైతం' అనే నినాదంతో కృష్ణాజిల్లా గుడివాడలో 'కృష్ణమ్మ శుద్ధిలో స్వచ్ఛ గుడివాడ' పేరుతో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, స్థానిక శాసనసభ్యుడు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) పాల్గొని పట్టణంలో ఉన్న మురుగు కాల్వలు శుభ్రం చేశారు. పురపాలక సంఘ సిబ్బంది జిల్లా అధికారులు, ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమంలో పాల్గొని రోడ్లపై ఉన్న చెత్తాచెదారం తొలగించారు. పేరుకుపోయిన మట్టిని, ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీశారు. స్వచ్ఛగుడివాడే లక్ష్యంగా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

'కృష్ణమ్మ శుద్ధిలో స్వచ్ఛ గుడివాడ'

ABOUT THE AUTHOR

...view details