విజయవాడలో ఓ మహిళా చార్టెడ్ అకౌంటెంట్ మృతి అనుమానాస్పదంగా మారింది. ప్రేమ పేరిట తమ కుమార్తెను మోసం చేసి హతమార్చి- ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోదంటూ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెతో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తే హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ యువతి తల్లిదండ్రులు విజయవాడ సీపీ, విజయవాడ ఎంపీ కేశినేనిని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తలకి బలమైన గాయం..
నగరంలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న చెరుకూరి సింధు ఈరోజు ఉదయం గుణదల గంగిరెద్దుల దిబ్బ వద్ద ఓ ఇంట్లో అనుమానాస్పద స్దితిలో మృతి చెందింది. ఫ్యాన్‌కి చీర వేలాడుతూ ఉంది. తలకి బలమైన గాయం ఉంది. సింధుతో సన్నిహితంగా ఉండే ప్రసేన్‌పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ అనంతరం ప్రసేన్‌కు చెందిన ఇంట్లోనే సింధు ఉంటోంది. వీరిద్దరి ప్రేమ వివాహానికి రెండు కుటుంబాలు అంగీకరించలేదు. సింధు దగ్గరకు తరచూ ప్రసేన్ వచ్చి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. తమ కుమార్తె సింధు గంగిరెద్దుల దిబ్బ వద్ద ఇళ్లు అద్దెకు తీసుకొని ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోందని చెప్పారు.
రెండు రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో తాము కంగారుపడి అనేకసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోయిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. గంపలగూడెంలో తాము ఉంటున్నామని.. ఈ రోజు అక్కడి నుంచి విజయవాడ వచ్చి అమ్మాయి ఉండే ఇంటికి వెళ్లి చూస్తే చనిపోయి కనిపించిందని వివరించారు. అమ్మాయి ఉంటోన్న ఇంటి యజమాని కుమారుడు ప్రసేన్ అలియాస్ అభి పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. ప్రసేన్ అతని కుటుంబ సభ్యులే తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా మలిచే ప్రయత్నం చేస్తున్నారంటూ సింధు తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:
అఫ్గానిస్థాన్‌లో ఆంధ్రుల కోసం.. విజయవాడలో ప్రత్యేక హెల్ప్ డెస్క్!