ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంతెన పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి! - suspect dead due to police chasing

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోయాడు.

వంతెన పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి

By

Published : Sep 29, 2019, 4:39 PM IST

వంతెన పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి...అసలు కారణం ఇదే!

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు జాతీయ రహదారి పక్కన ఓ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. రాష్ట్ర సరిహద్దుల్లోని పాలిటి వంతెన కింద నీటి మధ్యలో ఉన్న ఈ మృతదేహాన్ని వెంకన్న (40) అనే వ్యక్తిదిగా స్థానికులు గుర్తించారు. వారు తెలిపిన సమాచారం ప్రకారం... శనివారం రాత్రి బైక్ పై కోదాడ వైపు వెళ్తున్న వెంకన్నను చెక్ పోస్ట్ వద్ద తెలంగాణా పోలీసులు అడ్డుకున్నారు. బండి అక్కడే వదిలి వెనక్కి పరిగెత్తిన వెంకన్నను పోలీసులు వెంబడించారు. కొద్ది దూరం తర్వాత అతను కనిపించలేదు. పోలీసులు బండి తెచ్చి తక్కెళ్లపాడులో అప్పగించారు. ఈ రోజు ఉదయం వెంకన్న మృతదేహంగా తేలాడు. అతను వంతెనపై నుంచి పడి చనిపోయినట్టు భావిస్తున్నారు. ఘటనపై చిల్లకల్లు పోలీసుసు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details