కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు అద్దేపల్లి వెంకటేశ్వరరావుగా గుర్తించారు. అదే గ్రామానికి చెందిన యనమదల గాంధీకి చెందిన తోటలో గత కొంత కాలంగా వెంకటేశ్వరరావు పని చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. వెంకటేశ్వరరావు శరీరంపై గాయాలు ఉన్నాయి. తోట యజమాని గాంధీ సరైన సమాధానం చెప్పకపోవడంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్నీ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.
తోట కాపలాదారు అనుమానాస్పద మృతి - నూజువీడులో క్రైమ్ న్యూస్
కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మరణించాడు. ఆ వ్యక్తి కాపలా ఉంటున్న తోట యజమానిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
![తోట కాపలాదారు అనుమానాస్పద మృతి అనుమానాస్పదంగా వ్యక్తి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8818226-144-8818226-1600243589808.jpg)
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి