ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యానికి బానిసై.. యువకుడి ఆత్మహత్య! - మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య

విజయవాడలో మద్యానికి బానిసై సుభాని అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు... కుటుంబసభ్యులు తెలిపారు . అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

suside men
మద్యానికి బానిసై.. యువకుడి ఆత్మహత్య!

By

Published : Dec 19, 2020, 1:26 PM IST

విజయవాడ నగర శివారు ప్రకాష్ నగర్ లో షేక్ సుభాని అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పాలిష్ కార్మికుడిగా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. పోలీసులు ప్రాథమికంగా కుటుంబసభ్యులను.. సుభాని మృతికి గల కారణాలపై ఆరా తీశారు. మద్యానికి బానిసకావడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబీకులు చెబుతున్నారు. ఘటనను నున్న గ్రామీణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details