ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సూరేపల్లిలో గ్రామ సచివాలయాన్ని ముట్టడించిన స్థానికులు - krishna district surepalli news

కృష్ణాజిల్లా ముసునూరు మండలం సూరేపల్లిలో స్థానికులు గ్రామ సచివాలయాన్ని ముట్టిడించారుఅనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని... మరోసారి విచారణ చేపట్టి అర్హులకు ఇళ్లు కేటాయించాలని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.

Surepalli natives invaded gram panchayat at krishna district
గ్రామసచివాలయాన్ని ముట్టడించిన సూరేపల్లి స్థానికులు

By

Published : Jun 23, 2020, 7:39 PM IST

కృష్ణాజిల్లా ముసునూరు మండలం సూరేపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారంటూ స్థానికులు గ్రామ సచివాలయాన్ని ముట్టడించారు. ఇళ్లు ఉన్నవారికే మళ్లీ స్థలాలు కేటాయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ ముట్టడికి వచ్చిన గ్రామస్థులతో వాలంటీర్లు ఘర్షణకు దిగారు. దీంతో స్థానికులు సచివాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

రెవెన్యూ అధికారులు, వాలంటీర్లు అక్రమంగా అనర్హులకు ఇళ్లు కేటాయించారంటూ ఆరోపించారు. ఆన్‌లైన్ సర్వర్ నిలిచిపోయిందంటూ రెవెన్యూ అధికారులు చేతులెత్తేశారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హుల లిస్టు రద్దు చేసి... విచారణ చేసి అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details