ఏపీసీసీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలపై హైకోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టిందని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు సుప్రీం కోర్టు మొట్టికాయలు వేస్తోందని ఎద్దేవా చేశారు. న్యాయస్థానం తీర్పులను దృష్టిలో పెట్టకుని సీఎం జగన్ తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.
10వ తరగతి పరీక్షలు వద్దు : సుంకర పద్మశ్రీ - ఏపీలో 10వ తరగతి పరీక్షలు వద్దు
కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం మంచిది కాదని... ఏపీసీసీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా సీఎం జగన్ తనవైఖరి మార్చుకోవడం లేదని విమర్శించారు.
sunkara padmasri
వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందన్నారు. భాజపా, వైకాపా మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం మంచిది కాదని సూచించారు. పరీక్షలు లేకుండానే 10వ తరగతి, ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్ విద్యార్ధులను ప్రమోట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.