కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని ప్రసిద్ధ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు సూర్య కిరణాలు ఆరు నిమిషాల పాటు శివలింగంపై ప్రకాశించాయి. ప్రతి ఏడాది కార్తీకమాసంలో ఒకరోజు సూర్య కిరణాలు శివలింగంపై పడతాయని.. ఆలయ పూజారి తెలిపారు. ఉదయం 7 గంటల సమయంలో సూర్య కిరణాలు నేరుగా గర్భగుడిలోని బావిలో ఉద్భవించిన శివలింగంపై కిరణాలు పడగానే అభిషేకం నిర్వహించారు. ఈ అరుదైన సన్నివేశాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు.
శంభులింగేశ్వర ఆలయంలో గర్భగుడిని తాకిన సూర్యకిరణాలు - కృష్ణాజిల్లా తాజా వార్తలు
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని ప్రసిద్ధ స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు సూర్య కిరణాలు ఆరు నిమిషాల పాటు శివలింగంపై ప్రకాశించాయి. ప్రతి ఏడాది కార్తీకమాసంలో ఒకరోజు సూర్య కిరణాలు శివలింగంపై పడతాయని.. ఆలయ పూజారి తెలిపారు.
శంభులింగేశ్వర ఆలయంలో గర్భగుడిని తాకిన సూర్యకిరణాలు