ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో మరో రెండు రోజులూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు!

రాష్ట్రం రోజురోజుకూ నిప్పులకొలిమిలా తయారవుతోంది. వేసవి తాపానికి ఇల్లు వదిలి కాలు బయటపెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారు. మరో రెండు రోజులూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటోంది ఆర్టీజీఎస్. వడగాడ్పులు వీచే అవకాశం ఉందని... ఇదే సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారి పిడుగులు పడే అవకాశముందని హెచ్చరిస్తోంది.

పెరగనున్న ఉష్ణోగ్రతలు

By

Published : May 9, 2019, 9:20 PM IST

Updated : May 9, 2019, 9:42 PM IST

రాష్ట్రంపై నిప్పుల వర్షం కురిపిస్తున్న సూర్యుడు ప్రతాపాన్ని కొనసాగిస్తున్నాడు. మండుతున్న ఎండలతో గురువారం ఒక్కరోజే 52 ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రత‌లు నమోదయ్యాయి. 225 ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత‌ల ఎండ కాసింది. అత్యధికంగా తాడేప‌ల్లిగూడెంలో 47 డిగ్రీలు... చిత్తూరు జిల్లా నిండ్రలో 46.85 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఆర్టీజీఎస్ వెల్లడించింది.

జిల్లా అత్యధికం నమోదైన ప్రాంతం ఉష్ణోగ్రత(డిగ్రీల్లో)

శ్రీకాకుళం

వీరఘట్ట 41.8
అనంతపురం తాడిపత్రి 43
విజ‌య‌న‌గ‌రం జియ్యమ్మవ‌ల‌స 43.77
విశాఖ‌ రావికమతం 43.91
కడప కలసపాడు 44.56
కృష్ణా పెనమలూరు 45.76
రాజమహేంద్రవరం గ్రామీణం 46
గుంటూరు పెదనందిపాడు 46.22
నెల్లూరు నెల్లూరు 46.51
ప్రకాశం సంతనూతలపాడు 46.67
కర్నూలు దిన్నేదేవరపాడు 46.79
చిత్తూరు నిండ్ర 46.85
ప‌.గో. జిల్లా తాడేపల్లిగూడెం 47

కొనసాగుతాయి... అప్రమత్తంగా ఉండండి

మరో రెండు రాష్ట్రంలో ఎండలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశముందని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. రెండు రోజుల్లో గరిష్ఠంగా రెండ్రోజుల్లో గ‌రిష్ఠంగా 45 నుంచి 48 డిగ్రీలు న‌మోదయ్యే తెలిపింది. ఎండలతో పాటు వడగాల్పులు, పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమిదే!

బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఆవర్తనంలో మార్పుల వల్లే ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది. 12వ తేదీ నుంచి ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గుముఖం పట్టే అవకాశముందని వెల్లడించింది.

Last Updated : May 9, 2019, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details