ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అత్మాహత్యాయత్నం.. ప్రాణాలు కోల్పోయిన పిల్లలు..క్షేమంగా తల్లి

కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు.. కారణాలేవైనా పసిప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దురదృష్టం ఏంటంటే.. జన్మనిచ్చిన తల్లి చేతులే యమపాశాలవుతున్నాయి. ఏ పాపం తెలియని చిన్నారులను బలి తీసుకుంటున్నాయి. భర్త, అత్తింటివారితో గొడవల కారణంగా పిల్లల ఉజ్వల భవిష్యత్తును మొగ్గ దశలోనే తుంచేస్తున్నారు. తమ బిడ్డలను చంపి.. తాము చనిపోదామనుకున్నా.. తల్లులు ప్రాణాలతో బయటపడి గర్భశోకం అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో ఈ రెండుమూడు నెలల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఆత్మహత్యాయత్నం
ఆత్మహత్యాయత్నం

By

Published : Apr 20, 2021, 7:52 PM IST

కృష్ణా జిల్లాలో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉంగుటూరు మండలం నందమూరు కూడలికి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఉయ్యూరు మండలం వీరవల్లికి చెందిన వివాహితగా పోలీసులు గుర్తించారు. తన భర్త ఉదయం ద్వారకాతిరుమల వెళ్లే బస్సు ఎక్కించగా.. స్థానిక కూడలి వద్ద పిల్లలతో కలిసి వివాహిత దిగింది. అనంతరం పిల్లలతో కలిసి పంట కాలువలో దూకింది. గమనించిన జాలర్లు.. ముగ్గురినీ బయటకు తీశారు. విషాదం ఏంటంటే.. అప్పటికే ఇద్దరు పిల్లలు(బాబు, పాప) మృతి చెందారు. తల్లి క్షేమంగా బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details