ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆదాయం ఎంతంటే..! - శ్రీవల్లి, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆదాయం

మోపిదేవిలోని శ్రీవల్లి, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో స్వామి వారి ఆదాయం తగ్గింది.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆదాయం ఎంతంటే..!
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆదాయం ఎంతంటే..!

By

Published : Oct 7, 2020, 6:48 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని శ్రీవల్లి, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 199 రోజులకుగాను స్వామి వారి ఆదాయం రూ.25,50,948 నగదు, బంగారం సుమారు 48 గ్రాములు, వెండి - 1.5 కేజీలు, 11 యూఎస్ఏ డాలర్లు వచ్చాయని అధికారులు వివరించారు.

ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి జీవీడీఎన్ లీలా కుమార్, బందరు డివిజన్ దేవాదాయ శాఖ ఇన్​స్పెక్టర్ సుధాకర్ బాబు, ఆలయ సిబ్బంది, గ్రామస్థుల ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు. కరోనా వ్యాప్తి దృష్ట్య పదేళ్లలోపు పిల్లలను, వృద్ధులను ఆలయంలోకి అనుమతించడం లేదని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details