కృష్ణా జిల్లా నందివాడ మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారులు నీట మునిగాయి. మండలంలో పోలుకుండ నుంచి కుదరవల్లి వెళ్ళే రహదారి పూర్తిగా మునిగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుడమేరుకు భారీగా వరద నీరు రావడంతో సమీపంలోని గ్రామాలలో మోకాళ్ళ లోతు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నందివాడ మండలంలో నీట మునిగిన రహదారులు - heavy rain in krishna district
కృష్ణాజిల్లా నందివాడ మండలంలో కురిసిన భారీ వర్షాలకు రహదారులు నీటమునిగాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
నందివాడ మండలంలో నీట మునిగిన రహదారులు