ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్తగా.. పంటను కాపాడేందుకు రక్షణగా..! - సుబ్బారెడ్డి ప్రభుత్వ పాఠశాల సైన్స్ ఫెయిర్ న్యూస్

పంట వేసే సమయంలో రైతన్నల కష్టం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పంట పండే సమయంలో పక్షుల నుంచి దానిని రక్షించుకోవటం మరితం కష్టం. పక్షులు పంటను పాడు చేయకుండా రోజుల తరబడి రైతన్నలు కాపు కాస్తూనే ఉంటారు. దీనిని గుర్తించిన ఓ విద్యార్థి సరికొత్తగా ఆలోచించాడు. పక్షుల నుంచి పంటను కాపాడే యంత్రాన్ని రూపొందించాడు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/28-December-2019/5522207_203_5522207_1577544317527.png
పక్షుల్ని తరిమికొట్టే యంత్రాన్ని కనిపెట్టిన హర్షిత్​

By

Published : Dec 28, 2019, 10:14 PM IST

కృష్ణాజిల్లా పుల్లూరులోని అప్పిడి సుబ్బారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కె.టి.వి. హర్షిత్ పాఠశాల సైన్స్ ఫెయిర్​లో చేసిన ప్రయోగం అందరినీ అబ్బురపరుస్తోంది.పశువులు, పక్షుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు రూపొందించిన ప్రయోగం ఉపాధ్యాయులతోపాటు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మన్ననలు పొందింది.

పంట సమయంలో పక్షులు వచ్చి పంటను నాశనం చేస్తుంటాయి. అలాంటప్పుడు రైతులు పంట కాపు కాయాల్సి ఉంటుంది. అయితే మనుషులు దగ్గర లేకుండా.. పక్షుల్ని తరిమికొట్టే యంత్రాన్ని హర్షిత్​ కనిపెట్టాడు. సాంకేతికను ఉపయోగించి ధ్వనిని కలిగిస్తూ యంత్రాన్ని రూపొందించాడు. భవిష్యత్​లో మరిన్ని ప్రయోగాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటానని తెలిపాడు.

పక్షుల్ని తరిమికొట్టే యంత్రాన్ని కనిపెట్టిన హర్షిత్​

ఇదీ చదవండి: 'సైనికుల కోసం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్​ ఎగ్జిబిషన్​'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details