సుబాబుల్ కర్రకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఆదివారం పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. సుబాబుల్ కొనుగోళ్ల తీరును నిరసిస్తూ రహదారిపై కర్రను దగ్ధం చేశారు. ప్రాంతానికో ధర నిర్ణయించే 143 జీవో, ఆర్సీ ట్రేడర్స్కు లైసెన్సులు అనుమతించే 493 జీవోలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అటవీ అభివృద్ధి సంస్థ పేరిట అడవుల్లో సాగుచేసి విక్రయిస్తున్న జామాయిల్ వల్ల సుబాబుల్కు ధర లేకుండా పోయిందన్నారు. టన్ను సుబాబుల్ ధర 4200 ఉన్నప్పటికీ రైతుకు దక్కేది కేవలం 1600 నుంచి 2000 లోపు అని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు లేక అనేకమంది రైతులు ఏళ్ల తరబడి సాగు చేసిన కర్ర కొట్టడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన సుబాబుల్ రైతులు - సుబాబుల్ రైతుల నిరసన
అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్న తమకు న్యాయం చేయాలంటూ సుబాబుల్ రైతులు రోడ్డెక్కారు. రైతులకు నష్టం కలిగిస్తున్న రెండు జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళన చేస్తున్న రైతులు