ప్రభుత్వ ఆదేశానుసారం భూములను సర్వే చేసి ధ్రువీకరణ పత్రాలు అందిస్తామని నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మాంగైన్ వెల్లడించారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం మర్రిబంధం గ్రామంలో సర్వే ఆఫ్ ఇండియా వారిచే డ్రోన్ ద్వారా రీసర్వేను ప్రారంభించారు. పారదర్శకతతో కూడిన భూములకు సరిహద్దులు, హక్కుదారులకు ప్రభుత్వంతో ధ్రువీకరణ పత్రాల అందజేత, నిజనిర్ధారణ వంటి పనులు జరుగుతాయని చెప్పారు. భవిష్యత్తులో ఏ విధమైన భూ వ్యాజ్యాలు తలెత్తబోవని ఆశాభావం వ్యక్తం చేశారు. నూజివీడు తహసీల్దార్ ఎం.సురేష్ కుమార్, మండల అభివృద్ధి అధికారి జి. రాణి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఇతర అధికారులు పాల్గొన్నారు.
'భూములకు రీ సర్వే.. సామాన్యులకు వరం' - భూ రీసర్వేను ప్రారంభించిన నూజివీడు సబ్ కలెక్టర్
ప్రభుత్వ ఆదేశానుసారం భూముల్లో ప్రతి అంగుళం సర్వే చేసి ధ్రువీకరణ పత్రాలు అందిస్తామని నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మాంగైన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూములకు రీ సర్వే నిర్వహించటం సామాన్యులకు వరంలా మారిందని అన్నారు.
!['భూములకు రీ సర్వే.. సామాన్యులకు వరం' sub-collector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10358958-414-10358958-1611464680157.jpg)
డ్రోన్ ద్వారా భూ రీసర్వేను ప్రారంభించిన నూజివీడు సబ్ కలెక్టర్