పాఠశాలలోకి పాము... పరుగులు పెట్టిన విద్యార్థులు - snake in school located in kosooruvaripalem
కృష్ణా జిల్లా కోసూరువారిపాలెంలోని ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తరచూ పాములు వస్తుండటంతో భయభ్రాంతులకు గురవుతున్నారు.
కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కోసూరువారిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో... పాము కలకలం రేపింది. స్కూల్ ఆవరణలోని మరుగుదొడ్ల వద్దకు రక్త పింజరి పాము రావటంతో... విద్యార్ధులు భయభ్రాంతులకు గురై... కేకలు వేశారు. ఉపాధ్యాయుడు పాములు పట్టే వారిని పిలిపించి సర్పాన్ని చంపించారు. గతంలోనూ ఇదే స్కూల్లో ఒక త్రాచుపాము, పది వరకు పిల్లలు వచ్చాయి. స్కూల్కు ప్రహరి గోడ లేకపోవటంతో పాములు స్కూల్లోకి ప్రేవేశిస్తున్నాయి. అధికారులు పాఠశాలకు ప్రహారి గోడ నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్ధులు కోరుతున్నారు.