SSC Students Suicide: కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పదో తరగతి ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైన విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మండలంలోని పద్దరాయుడుతోటకు చెందిన శివకుమార్.. ఉరివేసుకొని మంగళవారం మృతిచెందగా.. కాజా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన డొక్కుమాల హేమచందర్(16) మంగళవారం శానిటైజర్ తాగి చనిపోయాడు.
పదో తరగతి పరీక్షలో ఫెయిల్.. మనస్తాపంతో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య - మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్య
SSC Students Suicide in Krishna District: తాజాగా వెలుబడిన పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కృష్ణా జిల్లాలో మంగళవారం ఒకరు చనిపోగా.. శానిటైజర్ తాగడంతో ఇవాళ మరొకరు బలవన్మరణం చెందారు.
హేమచందర్ తల్లి కొంత కాలం క్రితం మరణించగా.. తండ్రి ఓ ప్రైవేట్ జాబ్ చేస్తూ హైదరాబాద్లో ఉంటున్నాడు. నాయనమ్మ దగ్గర ఉంటున్న హేమచందర్.. కాజా జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి చదివాడు. శివకుమార్, హేమచందర్.. ప్రాణ స్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదివారు. స్నేహితుని మరణ వార్త విని కుంగుబాటుకు గురైన హేమచందర్.. నిన్న ఉదయం శానిటైజర్ తాగాడు. గ్రామస్థులు వెంటనే అతన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయాడు. కాజా పరిషత్ జిల్లా హై స్కూల్లో చదివే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. 'బాగా చదివాను.. ఎందుకు ఫెయిల్ అయ్యానో అర్థం కావడం లేదు' అని ఆవేదన వ్యక్తం చేశాడని హేమచందర్ స్నేహితులు అన్నారు.
ఇదీ చదవండి: