నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు కృష్ణా జిల్లా నందిగామలో విద్యార్థులు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. నందిగామలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక చైతన్య కళాశాల నుంచి గాంధీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు... మానవహారంగా ఏర్పడ్డారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... రైతులకు నష్టం కలిగించే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రసన్న కుమార్, ఇతర రైతు సంఘం నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
దిల్లీలో రైతులకు మద్దతుగా... నందిగామలో విద్యార్థుల ర్యాలీ - nandigama students rally latest news
దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా కృష్ణా జిల్లా నందిగామలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

నందిగామ విద్యార్థుల ర్యాలీ
Last Updated : Jan 27, 2021, 5:16 PM IST