భారత్ మాతా కీ జై - maddatu
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత బలగాలు చేసిన దాడులకు మద్దతుగా పెనమలూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. 'భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు చేశారు.
భారత బలగాలకు మద్దతు
పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో తీవ్రవాద శిబిరాలపై భారత బలగాలు చేసిన దాడులకు మద్దతుగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా పెనమలూరులోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన చిన్నారులు'భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు చేశారు. తీవ్రవాదుల దాడిలో మరణించిన 40 మంది జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.మరోమారు దాయాది దేశం భారత్ వైపు చూడాలంటే భయాపడాలన్నారు.
Last Updated : Feb 28, 2019, 10:53 AM IST