కృష్ణాజిల్లా నందిగామలో విద్యార్థులు, పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలను పాటించండి.. ప్రమాదాలను అరికట్టండి అంటూ ప్లకార్డులు చేతపట్టుకొని విద్యార్థులు నినాదాలు చేశారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే అనేక మంది ప్రమాదాల బారినపడి మృతి చెందుతున్నారని అన్నారు. అతివేగంతో వాహనాలు నడపడం ప్రమాదకరమని... రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నినాదాలు చేశారు. అనంతరం పట్టణంలోని రహదారిపై మానవహారం నిర్వహించారు.
ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల అవగాహన ర్యాలీ - nandhigama students rally on traffic rules news in telugu
కృష్ణాజిల్లా నందిగామలో విద్యార్థులు, పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని రహదారులపై మానవహారం నిర్వహించి ట్రాఫిక్ నియమాలు పాటించాలని నినాదాలు చేశారు. ప్రమాదాలను అరికట్టండి అంటూ వాహనదారులకు అవగాహన కల్పించారు.
students rallu on traffic rules in nandhigama