ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రీయింబర్స్​మెంట్​ బకాయిలు చెల్లించాలని విద్యార్థుల ఆందోళన - Students protest in Vijayawada

కళాశాలలో ఫీజు రియంబర్స్​మెంట్ బకాయిలు చెల్లించాలంటూ విజయవాడలో ఎస్​ఎఫ్ఐ, పీడీఎస్​యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. ప్రభుత్వం ఉపకార వేతనాలు చెల్లించకుండా నవరత్నాల పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారని వాపోయారు.

Students protest  in Vijayawada
ర్యాలీ చేస్తున్న విద్యార్థులు

By

Published : Jan 4, 2020, 2:47 PM IST

రీయింబర్స్​మెంట్​ బకాయిలు చెల్లించాలని విద్యార్థుల ఆందోళన

ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు విడుదల చేయాలని విజయవాడలో ఎస్​ఎప్​ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. 100 శాతం ఫీజు బకాయిలు, ఉపకార వేతనాలు చెల్లిస్తామని చెప్పి 7 నెలలు పూర్తైనా సీఎం హామీని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ధర్నా చౌక్ వరకు ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు ఆందోళన చేస్తుంటే పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని విద్యార్థి సమాఖ్య నాయకులు రమేష్ మండిపడ్డారు. ఉపకార వేతనాలు విడుదల చేయకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details