ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయోధ్య రామ మందిర నిర్మాణానికి సర్వ మత విద్యార్థుల విరాళం

కుల, మతాలకు అతీతమైనవి పాఠశాలలు. విద్యార్థులకు సర్వ మత సమానత్వాన్ని నేర్పుతూ.. వారిలో లౌకిక వాదాన్ని పెంపొందించటంలో విద్యాలయాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. అలాంటి లౌకిక వాదానికి పెద్ద పీట వేస్తోంది విజయవాడలోని రైట్‌ కంప్యూటర్స్‌. ఈ సంస్థకి చెందిన విభిన్న మతాలకు చెందిన విద్యార్థులు అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు అందించారు.

donation
అయోధ్య రామ మందిర నిర్మాణానికి సర్వ మత విద్యార్థుల విరాళం

By

Published : Jan 28, 2021, 1:23 PM IST

"మా విద్యాసంస్థలో కుల, మతాలకు తావుండదు. సర్వమత సమానత్వం" అని విద్యార్థులకు నేర్పుతామని.. విజయవాడలో రైట్‌ కంప్యూటర్స్‌ సంస్థ నిర్వహకుడు సయ్యద్‌ బాషా చెప్పారు. తమ విద్యార్థుల కోరికమేరకు అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

దేశంలోని విభిన్న మతాలు, జాతుల వర్గాల మేళవింపే భారతీయ సంస్కృతిగా విద్యార్థులు ఈ పవిత్ర కార్యాక్రమానికి భూరివిరాళాలు ఇవ్వటం.. సంతోషంగా ఉందని భాజపా మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బాజీ తెలిపారు. వివిధ మతాలకు చెందిన విద్యార్థులు తమ శక్తి కొలదీ రామాలయ నిర్మాణానికి విరాళాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details