కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే ఏపీ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు క్రాఫ్ట్ పిరియడ్లో తమ పాఠశాల ఆవరణలో...కూరగాయలను సాగు చేస్తున్నారు. ఎటువంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా పండిస్తున్నారు. అలాగే వాటిని రోజువారి వంటల్లో వినియోగిస్తున్నారు. అంతేగాక విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించి... పిల్లలు ఇంటి ఆవరణలో ఆకుకూరల సాగు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
మా ఉపాధ్యాయలు నిత్యం కొంత ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన విషయాలను తెలియజేసేవారు. అంతేగాక మాతో స్వయంగా కూరగాయలు, ఆకుకూరలను సాగు చేయించారు. పంటలను చీడ పురుగుల నుంచి ఏ విధంగా సంరక్షించుకోవాలి, జీవామృతాన్ని ఎలా తయారు చేసుకోవాలి వంటి విషయాలను ప్రయోగపూర్వకంగా తెలియజేసేవారు. ప్రసుత్తం మేము మా పాఠశాలలో పాలకూర, మెంతికూర, టమోటో, వంగ, సొర, గొంగూర, బచ్చలి కూరలను సాగు చేస్తున్నాము. _ విద్యార్థి