కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహించి బదిలీ అయిన ఆళ్ల రాంబాబును ఘనంగా సత్కరించారు.
అనంతరం విద్యార్థులు ఊరి చివర వరకు భారీ ర్యాలీ నిర్వహించి వీడ్కోలు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆయన్నే ప్రధానోపాధ్యాయులుగా ఉండాలని కంటతడి పెట్టుకున్నారు. సర్పంచి వేల్పుల పద్మ కుమారి, రవికుమార్ దంపతులు, గ్రామ పెద్దలు ర్యాలీలో పాల్గొన్నారు.