ఈ నెల 26,27 తేదీల్లో చేపట్టనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను వామపక్ష విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ మేరకు విజయవాడలో జరిగిన సమావేశంలో.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు విద్యార్థి సంఘాల మద్దతు
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26, 27 తేదీల్లో చేపట్టనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు వామపక్ష విద్యార్థి సంఘాలు మద్ధతు తెలిపాయి. మోదీ అధికారంలోకి వచ్చాక మత కల్లోలాలు పెరిగిపోయాయన్న వారు సమ్మెకు విద్యార్థులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
మాట్లాడుతున్న విద్యార్థి సంఘాల నాయకులు
నూతన విద్యా విధానం, విద్యా రంగంలో సంస్కరణల పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలకు లబ్ధి చేకూరేలా చేస్తున్నారని ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చాక మత కల్లోలాలు పెరిగిపోయాయన్నారు. విద్యార్థులు, కార్మికులు, రైతులంతా సమ్మెకు కలిసి రావాలని విద్యార్థులు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి