కృష్ణా జిల్లా మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో పురుగుల మందు సేవించి ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం సత్యనారాయణపురానికి చెందిన కొల్లి నాగవెంకట తేజగా గుర్తించారు. కాగా మృతుడు స్థానిక కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఎంబీఏ విద్యార్థి బలవన్మరణం - drinking insecticide
పురుగుల మందు సేవించి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా మైలవరంలో చోటుచేసుకుంది. మృతుడు ఖమ్మం జిల్లా వాసి అయిన నాగవెంకటతేజగా గుర్తించారు. అతను స్థానికంగా ఓ కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం.
విద్యార్థి ఆత్మహత్య