ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూజివీడు ట్రిపుల్​ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - iiit nuzvid student suicide

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్​ ఐటీలో విషాదం జరిగింది. మూడో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

నూజివీడు ట్రిపుల్​ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

By

Published : Sep 1, 2019, 6:26 PM IST

Updated : Oct 4, 2019, 12:22 PM IST

అమ్మాయి ఆత్మహత్య...?
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్​ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజినీరింగ్​ మూడో సంవత్సరం విద్యార్థిని భాగ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. బాలికల హాస్టల్ మూడో అంతస్తులోని రూమ్​నెంబర్​ 58లో చున్నీతో ఫ్యాన్​కు ఉరి వేసుకుంది. వసతి గృహ సిబ్బంది పరిశీలించే సమయానికే భాగ్యలక్ష్మి మృతి చెందిందని పోలీసులు నిర్ధరించారు. ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.

భాగ్యలక్ష్మి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా గోకవరం. ఈ సమాచారం తెలిసిన వెంటనే గ్రామంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

Last Updated : Oct 4, 2019, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details