తెలంగాణ హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేటు వసతి గృహంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన దుర్గా సాయికృష్ణ తేజ్... బీటెక్ మధ్యలో ఆపేశాడు. ఈ నెల 2న ఇంట్లో చెప్పకుండా వెళ్లాడు. 6న కేపీహెచ్‌బీలోని సాయి సుధా హాస్టల్లో చేరాడు.
హైదరాబాద్‌లో గుడివాడ యువకుడి ఆత్మహత్య - student suicide at hyderabad private hostel
వసతి గృహంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన దుర్గా సాయికృష్ణ తేజ్‌గా పోలీసులు గుర్తించారు.
![హైదరాబాద్‌లో గుడివాడ యువకుడి ఆత్మహత్య student suicide at hyderabad private hostel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5369828-814-5369828-1576307709352.jpg)
ఆత్మహత్య చేసుకున్న దుర్గా సాయికృష్ణ
హైదరాబాద్ లో గుడివాడ విద్యార్థి ఆత్మహత్య
ఇవాళ తెల్లవారుజామున హాస్టల్ కారిడార్‌లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు... కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్