కృష్ణా జిల్లా చల్లపల్లి నారాయణరావు నగర్లో... మంగళవారం జరిగిన 3వ తరగతి విద్యార్థి దాసరి ఆదిత్య హత్య కేసు వెనక వాస్తవాలను పోలీసులు బయటపెట్టారు. బీసీ వసతి గృహంలో ఉంటున్న పదవ తరగతి విద్యార్థి... మానసిక ఒత్తిడితోనే హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం బట్టలు ఉతికే విషయంలో పదో తరగతి విద్యార్థికి.. మూడో తరగతి విద్యార్థి దాసరి ఆదిత్యకి మధ్య ఓ చిన్న గొడవ జరిగిందన్నారు. ఈ వివాదంతో ఆదిత్యను ఎలాగైనా చంపేయాలని సదరు పదవ తరగతి విద్యార్థి కక్ష పెంచుకున్నట్లు తెలిపారు. పెన్సిల్ చెక్కే చిన్న చాకుతో.. రాత్రి పూట ఆదిత్యని నిద్రలేపి డాబా పైన ఉన్నటువంటి బాత్ రూమ్ల వద్దకు తీసుకువెళ్లి విచక్షణా రహితంగా మెడపై గాయం చేసి చంపాడని విచారణలో తేలినట్టు చెప్పారు. అనంతరం భయంతో నేరం తానే చేసినట్లు అతడు స్కూలు ఉపాధ్యాయుడి వద్ద విషయం వెల్లడించగా ... అక్కడి నుంచి తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. హత్య తీరును బట్టి.. ఆ బాలుడే నేరం చేసినట్లుగా పోలీసులు నిర్థరించారు. నిందితుడు నేరానికి ఉపయోగించిన ఆయుధం, రక్తపు మరకలు ఉన్న దుస్తులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు ఆధ్వర్యంలో 5 టీములు ఛేదించాయని కృష్ణా జిల్లా ఎస్పీ యం. రవీంద్ర నాథ్ బాబు.. చల్లపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
మానసిక ఒత్తిడితోనే బాలుడి హత్య: పోలీసులు - Student murder case
కృష్ణా జిల్లా చల్లపల్లి వసతి గృహంలో బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సహ విద్యార్థే హంతకుడని తేల్చారు.
మానసిక ఒత్తిడితో బాలుడి హత్య : పోలీసులు