కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో ఈత కొడుతుండగా అలల ఉద్ధృతికి కోటే బోసు అనే యువకుడు గల్లంతయ్యాడు. గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు మంగినపూడి సముద్రంలో ఈతకెళ్లారు. అలల ధాటికి కోటే బోసు అనే యువకుడు సముద్రంలోకి కొట్టుకెళ్లాడు. మిగిలిన వారంతా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన బోస్ కొరకు మెరైన్, తాలూకా పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. మరణించిన బోసు గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో బీఎస్సీ చదువుతున్నాడు.
సముద్రంలో ఈత కొడుతుండగా విద్యార్థి గల్లంతు.. మృతి
మచిలీపట్నం మంగినపూడి బీచ్లో విషాదం జరిగింది. సరదాగా స్నేహితులతో కలిసి ఒడ్డున ఈత కొడుతున్న వ్యక్తి అలల ధాటికి గల్లంతయ్యాడు. పోలీసులు గాలింపు చేపట్టగా మృతదేహం లభ్యమైంది.
ఈత కొడుతుండగా విద్యార్థి గల్లంతు