కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ గురుకుల పాఠశాలలో విద్యుదాఘాతంతో ఓ విద్యార్ధి మృతి చెందాడు. నాగయలంక మండలం గుల్లలమోదకు చెందిన విశ్వనాధపల్లి ఉదయ్(14) పులిగడ్డ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. నిన్న రాత్రి పాఠశాల ఆవరణలోని బాత్రూంపైకి ఎక్కి ఇనుపరాడ్‌తో కొబ్బరికాయలు కోస్తుండగా విద్యదాఘాతానికి గురయ్యాడు. దీంతో ఉదయ్ శరీరం, దుస్తులపై మంటలు వ్యాపించడంతో కుప్పకూలి పడిపోయి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి - student died with current shock in avani gadda
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ గురుకుల పాఠశాలలో విద్యుదాఘాతంతో ఓ విద్యార్థి మరణించాడు. పాఠశాల ఆవరణలోని బాత్రూంపైకి ఎక్కి ఇనుపరాడ్‌తో కొబ్బరికాయలు కోస్తుండగా కరెంట్ షాక్ తగిలింది.
![విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి student died with current shock in avani gadda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6424932-11-6424932-1584342082276.jpg)
అవనిగడ్డలో విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి