ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకున్న బీటెక్​ విద్యార్థి.. ఏం జరిగింది..? - ap crime news

Student suicide in Guru Nanak Engineering College: తెలంగాణలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్​ ఇంజినీరింగ్​ కళాశాలలో ఓ విద్యార్థి ఒంటిపై పెట్రోల్​ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ స్టూడెంట్​ను నగరంలో ఓ ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించారు. ఇంత జరిగినా సదరు కాలేజ్ యాజమాన్యం అసలీ ఘటనను దాచే ప్రయత్నం చేస్తోంది.

B tech student suicide
ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్మం

By

Published : Nov 2, 2022, 8:27 PM IST

Student Suicide in Guru Nanak Engineering College: తెలంగాణలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్​ ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం స్థానికంగా కలకలం రేపింది. బీటెక్​ మూడో సంవత్సరం చదువుతున్న వంశీ పటేల్ (22) అనే విద్యార్థి ఒంటిపై ప్రెట్రోల్​ పోసుకొని నిప్పుంటించుకున్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతన్ని యాజమన్యం ఇబ్రహీంపట్నంలోని లిమ్స్​ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో నగరంలో మరో ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమ మహేశ్వరరావు, సీఐ రామకృష్ణ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఘటనపై స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది. మరో వైపు ఈ ఘటన కళాశాల లోపల జీఎం, అడ్మిన్ కార్యాలయం జరగ్గా విషయాన్ని అసలు విషయం చెప్పకుండా ఫోన్ పేలిందంటూ ప్రకటించింది. కానీ ఘటనా స్థలంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఆనవాళ్లు ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details