కృష్ణా జిల్లాలో ఇప్పటివరకూ 5 వేల వాహనాలు సీజ్ చేశామని ఏఎస్పీ సత్తిబాబు తెలిపారు. వేలాది వాహనాలకు జరిమానాలు విధించామన్నారు. 100 దుకాణాలపై కేసులు నమోదు చేశామని చెప్పారు. లాక్ డౌన్ పాటించకపోతే కరోనా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని... దీంతో లాక్ డౌన్ మరిన్ని రోజులు కొనసాగించాల్సి వస్తుందన్నారు.
కృష్ణా జిల్లాలో లాక్డౌన్ మరింత కఠినం - @corona ap cases
కృష్ణాజిల్లాలో లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఏఎస్పీ మోకా సత్తిబాబు తెలిపారు. చల్లపల్లి, అవనిగడ్డలలో లాక్డౌన్ అమలును పరిశీలించేందుకు ఉదయం నుంచి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ప్రధాన సెంటర్లో వాహనాలు తనిఖీలు చేసి అనవసరంగా రోడ్లపై తిరిగే వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. జరిమానాలు విధించాల్సిందిగా పోలీసులను ఏఎస్పీ ఆదేశించారు.
కృష్ణాజిల్లాలో లాక్డౌన్ మరింత కఠినం