చిరునామా చెప్పమనో.. టైం చెప్పమనో అడిగినట్టు నటిస్తూ మీ దగ్గర ఏమేం వస్తువులు ఉన్నాయి.. మీ చుట్టు పక్కల ఎవరైనా ఉన్నారా.. దొంగతనం చేశాక ఎటువైపు నుంచి పారిపోవచ్చు.. సీసీ కెమెరాలు లేని వీధులు గుర్తించి.. దొరికిన కాడికి దోచేస్తున్నారు. అయితే తరహా చోరీల్లో ఎక్కువగా చరవాణులు పోతున్నాయి. ఈ విషయం పోలీసులకు చెబితే పట్టించుకోరు సరికదా.. కొందరైతే అవమానకరంగా మీరే పొగొట్టుకున్నారని ఎద్దేవా చేస్తారు. కేసు నమోదుకు అసలే ముందుకు రారు. ఇలాంటి కేసులు నమోదవ్వడాన్ని వేళ్లమీద లెక్కించవచ్చు.
సత్యనారాయణపురంలోని సాంబమూర్తి రోడ్డులో ఓ వ్యక్తి కార్‌వాష్ చేయించుకునేందుకు మధ్యాహ్నం సమయంలో వచ్చాడు. మెకానిక్‌కు కారు ఇచ్చిన అతను రోడ్డుపక్కనే నిల్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. ఈ సమయంలో పల్సర్ వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. చేతిలో చరవాణి లాక్కొని వేగంగా వెళ్లిపోయారు. దీనిపై సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ తరహా కేసులు కమిషనరేట్ పరిధిలో తరచూ జరుగుతున్నాయి.
ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి అర్ధరాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ సమయంలో మరో ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు చిరునామా చెప్పమని అడగ్గా.. సమాధానం చెప్పారు. సరే అని చెప్పిన వారు.. అనంతరం వేగంగా వచ్చి అతని జేబులో ఉన్న చరవాణిని లాక్కొని వెళ్లిపోయారు. పెంటపడినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషయమై పటమట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
- మొక్కదశలో తుంచేస్తేనే
రాత్రిళ్లు ఒంటరిగా వెళ్తున్న వారిపై దాడిచేసి.. దోచేస్తున్న ముఠాలు నగర పరిధిలో పెరిగాయి. వీటికి అదిలోనే అరికట్టకపోతే.. మున్ముందు పెద్దచోరీలకు దారితీసే ప్రమాదముంది. సెల్‌ఫోన్ చోరీపై బాధితుడు ఫిర్యాదు చేస్తే.. పోలీసులు దాన్ని అతని వ్యక్తిగత సమస్యగా, ఏదో చిన్న సమస్యగా చూస్తున్నారు. పొగొట్టుకున్న తీరును పరిశీలించడం లేదు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి నుంచి చరవాణి లేదా ఇతర వస్తువులు లాక్కొనే ప్రయత్నంలో బాధితుడు కిందపడే ప్రమాదం ఉంది. దీంతో తీవ్ర గాయాలవ్వడంతో పాటు.. ప్రాణాలు పొగొట్టుకునే పరిస్థితి రావొచ్చు.
- కేసు కట్టాలా.. కుదరదు