కృష్ణా జిల్లా నందిగామ మార్కెట్ యార్డులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గత వారం రోజులుగా పత్తి కొనుగోళ్లు చేయకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాణ్యత లేదని సీసీఐ బయ్యర్స్ కోనుగోళ్లు చేయటంలో విముఖత చూపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో తడిసిన పత్తి నాణ్యత లేదని..., ఇలాంటి పత్తి కోనుగోలు చేయలేమని బయ్యర్ చెప్పటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్ యార్డ్ ఆవరణలో ప్రస్తుతం పత్తి నిల్వలు పేరుకుపోతున్నా.. గత కొన్ని రోజులుగా కొనుగోలు చేయటం లేదని అన్నదాతలు వాపోతున్నారు. బయ్యర్ తీరుపై స్థానిక ఎమ్మెల్యే జగన్మోహనరావు సీసీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇకనైనా సీసీఐ పత్తిని కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.