ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు..కౌన్సెలింగ్ - counselling by koduru tahsildhar news today

కృష్ణాజిల్లా కోడూరు గ్రామానికి చెందిన మైనర్ బాలికకు వివాహం చేయబోతున్న తల్లిదండ్రులు, వరుడ్ని కోడూరు ఠాణాలో అధికారులకు కౌన్సెలింగ్ చేశారు. ఎంపీయూపీ స్కూల్ కోడూరులో 8వ తరగతి చదువుతున్న బాలికను ఆర్థిక కారణాల దృష్ట్యా మూడు పదులు దాటిన దివ్యాంగుడికిచ్చి పెళ్లి చేసేందుకు బాధితురాలి తల్లి సిధ్ధమైంది.

ఆగిన బాల్య వివాహం.. తహసీల్దార్ సమక్షంలో కౌన్సెలింగ్
ఆగిన బాల్య వివాహం.. తహసీల్దార్ సమక్షంలో కౌన్సెలింగ్

By

Published : Oct 3, 2020, 9:20 AM IST

కృష్ణాజిల్లా కోడూరు గ్రామానికి చెందిన మైనర్ బాలికకు వివాహం చేయబోతున్న తల్లిదండ్రులు, వరుడ్ని కోడూరు పోలీస్ స్టేషన్​లో అధికారులు కౌన్సెలింగ్ చేశారు. ఎంపీయూపీ స్కూల్ కోడూరులో 8వ తరగతి చదువుతున్న బాలికను ఆర్థిక కారణాల దృష్ట్యా సుమారు 30 ఏళ్లు దాటిన దివ్యాంగుడికిచ్చి పెళ్లి చేసేందుకు బాధితురాలి తల్లి సిధ్ధమైంది.

రూ.లక్ష ఎదురు కట్నం..

ఈ క్రమంలో రూ.లక్ష ఎదురు కట్నం తీసుకుని తన కూతురిని పెళ్లి పీటలెక్కించాలనుకుంది. బాలిక తల్లి గత కొద్ది రోజులుగా చేస్తున్న యత్నాలను స్థానికులు నిశితంగా గమనించారు.

తహసీల్దార్ సమక్షంలో..

ఫలితంగా తమ కళ్ల ముందే పిల్లలతో ఆడుతూ, పాడుతూ తిరిగే అమ్మాయికి పెద్ద వయసు వారితో వివాహాన్ని ఖండించారు. వెంటనే ఎంపీయూపీ స్కూల్ కోడూరు హెచ్ఎమ్ నాగభూషణానికి సమాచారం అందించారు. కోడూరు తహసీల్దార్, పోలీసుల సమక్షంలో నిందితులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఇవీ చూడండి : కాలుష్యరహితంగా విశాఖను అభివృద్ధి చేస్తాం: విజయసాయి రెడ్డి

ABOUT THE AUTHOR

...view details