ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు సమగ్ర సర్వే' - "Statewide Survey on Corona Outbreak"

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సమగ్ర సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటా సర్వేతో ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని.... సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ గురువారంలోగా పూర్తికావాలని నిర్దేశించారు. లాక్‌డౌన్ నిబంధనలను ప్రజలు బాధ్యతగా భావించి పాటించాలని.. సీఎం పునరుద్ఘాటించారు.

'కరోనా వ్యాప్తి పై రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు సర్వే'
'కరోనా వ్యాప్తి పై రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు సర్వే'

By

Published : Mar 24, 2020, 11:43 PM IST

Updated : Mar 25, 2020, 7:43 AM IST

మరోసారి సర్వే నిర్వహించనున్న ప్రభుత్వం

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై అంచనా కోసం మరోమారు సర్వే చేపట్టాలని.. ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటి సర్వేతో... ప్రతి ఇంట్లోనూ ఉన్నవారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్​ఎంల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియ గురువారంలోగా పూర్తి చేయాలని నిర్దేశించారు. తర్వాత కూడా తాజా వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరచాలని స్పష్టం చేశారు. సర్వే సమాచారం ఆధారంగా కరోనా నివారణకు చర్యలు చేపట్టాలని టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఆదేశించారు.

ప్రజలు నిబంధనలు పాటించాలి

విదేశాల నుంచి వచ్చిన వారు... వారితో సన్నిహితంగా ఉన్నవారు సహా... ఇతరులకూ కరోనా సంక్రమించిందా అన్న కోణంలో సర్వే చేయాలని సీఎం అధికారులకు సూచించారు. కరోనా లక్షణాలున్న వారికి సత్వర వైద్య సహాయం అందించాలని స్పష్టం చేశారు. సామాన్యులు కరోనా బారిన పడకుండా ఉండాలంటే... వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వ సూచనలను పాటించాలన్నారు. సర్వే సమాచారాన్ని విశ్లేషించి మరిన్ని చర్యలు చేపడతామన్న ఆయన.. లాక్​డౌన్​ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని పునరుద్ఘాటించారు.

ఇదీ చూడండి:

కరోనా తాజా బులెటిన్: ఏడుగురికి పాజిటివ్

Last Updated : Mar 25, 2020, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details