విజయవాడలో హత్యకు గురైన చిన్నారి ద్వారక కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఈ ఘటన రాష్ట్ర ప్రజలందరినీ కలచి వేసిందని తెలిపారు. అసలు హత్య ఎలా జరిగిందనేది విచారణలో బయటపడనుందని అన్నారు. కారణాలు ఏవైనా, నిందితులను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. చిన్న పిల్లల పట్ల జరిగే నేరాలను అరికట్టడానికి... ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు అనుమతిస్తూ జీవో జారీ చేసిందని ఛైర్పర్సన్ వివరించారు.
చిన్నారి ద్వారక కుటుంబాన్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ - విజయవాడలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
విజయవాడలో హత్యకు గురైన ఎనిమిదేళ్ల చిన్నారి ద్వారక కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని ఆమె స్పష్టం చేశారు.
విజయవాడలో హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించినవాసిరెడ్డి పద్మ
TAGGED:
వాసిరెడ్డి పద్మ తాజా వార్తలు