పట్టణాభివృద్ధి శాఖ సమీక్షలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు పట్టణ ప్రజలపై మరింత భారం మోపాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాబూరావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రమాదకరమైన షరతులకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గుతోందని ఆయన ఎద్దేవా చేశారు.
పన్నుల పెంపును ఉపసంహరించాలి..
ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను, యూజర్ ఛార్జీల విధింపు తదితర ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశాలపై జగన్ సర్కార్ పునరాలోచన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని బాబూ రావు హెచ్చరించారు.
ఇవీ చూడండి:
అక్టోబర్ 19న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం!