ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్​కు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ లేఖ - State United Teachers Federation latter to cm

జీవో నెంబర్ 3 చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో గిరిజనుల విద్య, ఉపాధికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) పేర్కొంది. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 2 ఏళ్లు ఆన్ డ్యూటీపై స్టడీ లీవ్ అంశాన్ని పునరుద్దరించాలని ముఖ్యమంత్రిని కోరారు.

State United Teachers Federation
సీఎం జగన్​కు రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ లేఖ

By

Published : Jul 9, 2020, 11:14 PM IST

టీచర్ ఉద్యోగాల నియామకాల్లో గిరిజనులకు న్యాయం జరిగేందుకు ఉద్దేశించిన జీవో నెంబర్ 3 పునరుద్దరణ కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని... ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ముఖ్యమంత్రి వైఎస్ జగన్​ను కోరింది. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గిరిజనుల ప్రయోజానాలు రక్షించాలని లేఖలో కోరారు. గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో​ జీవో నెంబర్ 3 తీసుకువచ్చారని.. దీనిప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు గిరిజనులతోనే భర్తీ చేస్తూ వచ్చారని వివరించారు. దీనివల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో కొంత మేర విద్యాభివృద్ది, ఉపాధి పెరిగిందని యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ బాబ్జి, బాబురెడ్డి లేఖ ద్వారా సీఎంకు వివరించారు. పదోన్నతుల కోసం విద్యార్హత పొందేందుకు వేతనంతో కూడిన సెలవుల సదుపాయాన్ని తొలగించారని.. దీన్ని పునరుద్దరించాలని లేఖలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details