ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ఉపాధి హామీని నిర్వీర్యం చేయటానికి కేంద్రం ప్రయత్నం" - వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లి విల్సన్ తాజా సమాచారం

బడ్జెట్​లో గ్రామీణ పేదలకు సంబంధించిన కేటాయింపులను పక్కదారి పట్టించేలా రూపకల్పన చేశారని... వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లి విల్సన్ ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి కేటాయింపు తగ్గించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంపై ఈ నెల 12వ తేదీన దేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు.

state president of the Agricultural Labor Union  Jally Wilson
కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయటానికి యత్నిస్తోంది

By

Published : Feb 9, 2021, 4:38 PM IST

ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయింపు తగ్గిస్తూ.. క్రమంగా పథకాన్ని నిర్వీర్యం చేయటానికి కేంద్రం యత్నిస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లి విల్సన్ ఆరోపించారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్మిక సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

బడ్జెట్​లో గ్రామీణ పేదలకు సంబంధించిన కేటాయింపు తగ్గించటాన్ని ఖండించారు. ఈ నెల 12వ తేదీన జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. కూలీ రేట్లు తగ్గిస్తూ ఉపాధి హామీని దెబ్బతీస్తున్నారని ఆయన విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details