సినిమాలు విడుదలవుతున్నప్పటికీ... కరోనా రెండో దశ విజృంభణతో ప్రేక్షకుల రాక తగ్గి తీవ్రంగా నష్టపోతున్నామని ఎగ్జిబ్యూటర్ల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో రాష్ట్ర ఎగ్జిబ్యూటర్ల సంఘం ప్రతినిధులు సమావేశం నిర్వహించించారు. థియేటర్ మెయింటెనెన్స్ ధరలు పెంచి ఫిక్స్డ్ ఛార్జీలు పెట్టాలని కోరారు.
అన్ని సెంటర్లకు జీఎస్టీ ఒకేలా ఉన్నందున.. టిక్కెట్ ధర కూడా ఒకే విధంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటీటీల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, సినీ రంగాన్ని పరిశ్రమగా గుర్తించి రాయితీలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.