ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'డోర్ డెలివరీ వద్దు... పాత విధానమే కావాలి..!' - లారీ యజమానుల సంఘం వార్తలు

తమ సమస్యలు పరిష్కరించే వరకు లారీలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు 13 జిల్లాల లారీ యజమానుల సంఘం నాయకులు తెలిపారు. విజయవాడలో ఇసుక లారీ యజమానుల జేఏసీ మహాసభ నిర్వహించారు. ఇసుక డోర్ డెలివరీ విధానం వల్ల ఎదురవుతున్న సమస్యలను చర్చించారు. ప్రభుత్వం పాత విధానాన్నే అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

state lorry woners jac
రాష్ట్ర ఇసుక లారీ యజమానుల జే.ఏ.సి మహాసభలు

By

Published : Jan 26, 2020, 12:05 PM IST

విజయవాడలో ఇసుక లారీ యజమానుల జేఏసీ మహా సభలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక డోర్ డెలివరీ విధానం వల్ల లారీ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు. విజయవాడలో ఇసుక లారీ యజమానుల జేఏసీ మహాసభ నిర్వహించారు. డోర్ డెలివరీ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు లారీలో ఇసుక లోడింగ్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details