విపత్తులో ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచిందని మాజీ మంత్రి ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. వరద వస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించి ... డ్యామ్ల నుంచి ఒక్కసారిగా లక్షలాది క్యూసెక్కుల నీటిని వదలడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అమరావతిని ముంచటానికి ఉద్దేశపూర్వక కుట్ర కాదా అని ప్రశ్నించారు.
ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచింది: దేవినేని ఉమ - damulur latest news
వరదలతో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు
దేవినేని ఉమ
పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం పరిహారం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. మరోవైపు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని దేవినేని ఉమ కోరారు.