సుబాబుల్ పంటకు రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించాలంటూ కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం మొగులూరులో తెదేపా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. సుబాబుల్ టన్నుకు 5000 రూపాయలు ఇప్పిస్తామని ఎన్నికల ప్రచారంలో వైకాపా ఇచ్చిన వాగ్దానాలు ఏమైపోయాయని తంగిరాల సౌమ్య నిలదీశారు. ప్రస్తుతం టన్నుకు వెయ్యి రూపాయలు కూడా రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
సుబాబుల్ సాగు రైతుల సమస్యల పరిష్కారానికి వేసిన కమిటీ, కమిటీ సభ్యులు ఎక్కడికి పోయారని సౌమ్య నిలదీశారు. పాదయాత్రలు చేసి, సన్మానాలు చేయించుకున్న అధికార పార్టీ నాయకులు ఏమైపోయారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారాల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం వెంటనే సబాబుల రైతాంగానికి టన్నుకు 5 వేల రూపాయలు ఇవ్వాలని తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు.