రాష్ట్ర అవతరణ వేడుకలను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ వద్ద జాతీయ పతాకాన్ని మంత్రి కొడాలి నాని ఆవిష్కరించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా రాష్ట్ర అవతరణ కోసం కృషి చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.