ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CEC called State EC : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు

కేంద్ర ఎన్నికల సంఘం
కేంద్ర ఎన్నికల సంఘం

By

Published : Jul 11, 2023, 12:00 PM IST

Updated : Jul 11, 2023, 7:46 PM IST

11:54 July 11

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు!

CEC called State EC: కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనా దిల్లీ వెళ్లారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి.స్థానిక యంత్రాంగం ఇష్టారీతిన ఓట్ల చేర్పులు,తీసివేతలకు పాల్పడిందని పలు పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. అధికార పార్టీ నాయకుల ఆగడాలను అధికారులు చూస్తూ మిన్నకుండిపోయారని తెలిపాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓట్ల గల్లంతుపై ఆయా ఫిర్యాదుల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను పిలిపించినట్లు సమాచారం. దిల్లీకి చేరుకున్న ముఖేశ్ కుమార్ మీనా.. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారు.

సీఈసీకి చంద్రబాబు లేఖ..ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని తెలుగు దేశం అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమిషనర్​కు లేఖ రాశారు. అధికార పార్టీ వైఎస్సార్సీపీ నేతలు, ఎన్నికల అధికారులు కుమ్మక్కయ్యారని,పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు చేర్చారనిఫిర్యాదులో పేర్కొన్నారు. డిగ్రీ చదవని, కేవలం పదో తరగతి పూర్తి చేసిన వారిని సైతం నకిలీ సర్టిఫికెట్లతో ఓటర్లుగా నమోదు చేశారని ఆక్షేపించారు.

వైఎస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడ్డదారులు తొక్కుతోందని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లను చేరుస్తోందని ప్రతిపక్షాలు సైతం మండిపడ్డాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అనర్హులను చేర్చినట్లు పలు రాజకీయ పార్టీల నాయకులు ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేశారు. మరో వైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్​కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖరాశారు. వైఎస్సార్సీపీ నేతలు, పలు చోట్ల ఎన్నికల అధికారులు కుమ్మక్కై చేర్చిన బోగస్ ఓట్ల వివరాలను జత చేశారు. అధికారులు, పోలీసుల వైఖరితో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతోందని మండిపడ్డారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో.. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల సీన్ రిపీట్ అవుతోందని చంద్రబాబు ఆరోపించారు. డిగ్రీ చదవని వ్యక్తులు నకిలీ సర్టిఫికెట్లతో ఓటర్లుగా నమోదయ్యారని ఆక్షేపించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థికి అనుకూలంగా తప్పుడు చిరునామాలతో పెద్ద సంఖ్యలో నకిలీ ఓటర్లను చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముఖేష్‌ కుమార్‌ మీనాను ఢిల్లీకి పిలవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ఎన్నిక సంఘం అధికారులతో... ముఖేష్ కుమార్ మీనా సుమారు గంట పాటు భేటీ అయినట్లు తెలిసింది. ఉన్నతాధికారులతో సమావేశం ముగియడంతో ఆయన విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు.

Last Updated : Jul 11, 2023, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details