ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం... కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... పరీక్షకు ముందు, తర్వాతా కేంద్రాలను శుభ్రం చేస్తామని, ప్రతి సెంటర్‌లో ఇసోలేషన్ గదులు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. టీసీఎస్, ఏపీ ఆన్‌లైన్ సంయుక్తంగా ఈ ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహిస్తాయని తెలిపారు. సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని చెప్పారు.
'ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారమే ప్రవేశ పరీక్షలు' - news updates of minister adhimulapu suresh
రాష్ట్రంలో ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారమే ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. పరీక్షా కేంద్రాలను నిత్యం శానిటైజ్ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సి అవసరం లేదన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్