రాష్ట్రంలో నూనెల ధరలు మరింత పెరుగుతాయి - ఏపీలో నూనె ధరలు
ప్యాకింగ్ లేకుండా విడిగా నూనెల విక్రయాన్ని నిలుపుదల చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఎడిబుల్ ఆయిల్స్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డిమాండ్ చేసింది. ఈ తరహా ఆదేశాలతో రాష్ట్రంలో నూనెల ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్యాకింగ్ లేకుండా విడిగా నూనెల విక్రయాన్ని నిలుపుదల చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. రాష్ట్ర ఎడిబుల్ ఆయిల్స్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంఘం డిమాండ్ చేసింది. ఈ తరహా ఆదేశాల అమలు వల్ల.. రాష్ట్రంలో నూనెల ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. లక్షలాది మంది చిరువ్యాపారులు, వర్తకులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీవోను వ్యతిరేకిస్తూ.. వర్తక సంఘాల నేతలు విజయవాడలో సమావేశమయ్యారు. కల్తీ నెపం వేసి చిన్న దుకాణాలను పక్కన పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.