అగ్ని ప్రమాదానికి వైద్యులను బాధ్యులను చేయడం తగదని రాష్ట్ర కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు అధ్యక్షులు డాక్టర్ రాఘవశర్మ, కార్యదర్శి డాక్టర్ కార్తీక్‌లు సీఎం జగన్‌కు లేఖ రాశారు. విజయవాడలోని స్వర్ణా ప్యాలెస్ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనకు రమేష్ ఆస్పత్రుల యాజమాన్యానికి సంబంధం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి మాత్రమే ఆస్పత్రి యాజమాన్యం ఆ హోటల్‌లో వైరస్ బాధితులకు చికిత్స అందిస్తోంది. అందులో జరిగిన అగ్ని ప్రమాదానికి వైద్యులను బాధ్యులను చేయడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ బాధితులకు చికిత్స అందించే వైద్యులను తప్పుబట్టే చర్యలు సరైనవి కావు అని పేర్కొన్నారు.
'విజయవాడ అగ్నిప్రమాద ఘటనతో వైద్యులకు సంబంధం లేదు' - రాష్ట్ర కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా
విజయవాడలోని స్వర్ణా ప్యాలెస్ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనకు రమేష్ ఆస్పత్రుల యాజమాన్యానికి సంబంధం లేదని రాష్ట్ర కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది.
రాష్ట్ర కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా